కారుపై రాళ్లు రువ్విన కేసులో ముగ్గురు అరెస్ట్

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుద్దవాగుతండా పరిధిలో కాంగ్రెస్ నాయకులు ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ముజాహిద్‌పురం క్రాస్‌రోడ్డు వద్ద కారుపై రాళ్లు రువ్వినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి భానోత్ కిషన్, బానోత్ మోహన్, బానోత్ రవిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.


