భీమడోలు హత్య కేసులో దంపతుల అరెస్టు

ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసనపల్లిలో సెప్టెంబర్ 19 రాత్రి జరిగిన విజయనగరం జిల్లా రామభద్రపురానికి చెందిన తుమ్మల లక్ష్మణ (37) హత్య కేసులో మామిడి గౌరీశంకర్, భార్య లక్ష్మీదుర్గను అరెస్టు చేసినట్లు సీఐ పి.కృష్ణ తెలిపారు. వివాహేతర సంబంధం వివాదంతో పథకం పన్ని ఇనుప రాడ్డుతో కొట్టి చంపి, మృతదేహాన్ని పోలవరం కాలువలో పడేశారని పోలీసులు చెప్పారు. ఇప్పటికే మరో ముగ్గురు అదుపులో ఉన్నారు.



