← Back to news

జూరాల నీటి విడుదల రైతుల విజయమే: లక్ష్మారెడ్డి

By Surender Panuganti· 11h ago· Jadcherla, Jadcherla, Mahabubnagar
జూరాల నీటి విడుదల రైతుల విజయమే: లక్ష్మారెడ్డి

జూరాల ఆయకట్టు రైతుల ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గి సాగునీరు విడుదల చేయడం రైతుల విజయమని మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ఆయకట్టు రైతులు ఎనిమిది రోజులుగా చేసిన పోరాటం ఫలించిందని తెలిపారు. వానాకాలం పంటలు పూర్తయ్యే వరకు నిరంతరంగా నీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాలకు అతీతంగా బీఆర్‌ఎస్‌ రైతులకు అండగా నిలుస్తుందని చెప్పారు. సాగునీటి విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Local