← Back to news

ప్రశ్న రావణ్ అరెస్ట్.. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి!

By sahani· 2 Jul 2026· Pitapuram

ప్రశ్న రావణ్ అరెస్ట్ పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రావణ్‌కు వెంటనే కఠిన శిక్ష పడాలంటూ జనసైనికులు పోలీస్ వాహనాన్ని అడ్డుకుని కోడిగుడ్లతో దాడికి దిగారు. అయితే, సరిగ్గా నిన్ననే డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం గురించి క్లియర్‌గా మాట్లాడారు. ఈ నేపథ్యంలో, విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన జనసైనికులపై కూడా చట్టప్రకారం కేసులు పెడతారా? అసలు ఈ దాడులు ఏ చట్టం, ఏ స్వేచ్ఛ కిందకు వస్తాయంటూ ప్రజలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

More in Politics