భద్రాచలం దగ్గర పెరిగిన గోదావరి

TG: భద్రాచలం దగ్గర గోదావరి ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో ప్రాణహిత, ఇంద్రావతి వంటి ఉపనదుల నుంచి వరద నీరు గోదావరిలోకి చేరుతోంది. సెప్టెంబర్ 27న ఉదయం 6 గంటలకు 39.7 అడుగులు ఉన్న నీటిమట్టం సాయంత్రం 6 గంటలకు 42.8 అడుగులకు పెరిగింది. 43 అడుగులు అనేది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి. నీరు పెరగడంతో స్నాన ఘట్టాలు మునిగాయి. కరకట్టపైకి సందర్శకుల రాకను నిలిపివేశారు. ఎగువన వరద తగ్గితే నీటిమట్టం తగ్గే ఛాన్స్ ఉంటుంది.

