← Back to news

మాలల ఛలో సెక్రటేరియట్ ఉద్రిక్తం

By Srinivas· 4d ago
మాలల ఛలో సెక్రటేరియట్ ఉద్రిక్తం

రోస్టర్ విధానాన్ని సవరించి మాలలకు 20 పాయింట్లలోపు రెండు రోస్టర్ పాయింట్లు కేటాయించాలని, జీవో నంబర్‌ 99ను రద్దు చేయాలని మాల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు పోలీసుల నిర్బంధాలను అధిగమించి సెక్రటేరియట్‌ ముట్టడికి ప్రయత్నించడంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల తోపులాటలో జాతీయ అధికార ప్రతినిధి దార సత్యంకు గాయాలయ్యాయని, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అస్వస్థతకు గురయ్యారని నిర్వాహకులు తెలిపారు.

More in Local