← Back to news

ముగ్గురే స్టూడెంట్స్.. భోజనం కూడా బంద్!

By BK· 7h ago· నారాయణపేట
ముగ్గురే స్టూడెంట్స్.. భోజనం కూడా బంద్!

TG: నారాయణపేట జిల్లా బహర్‌పేట గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్‌లో కేవలం ముగ్గురు స్టూడెంట్స్ చదువుతున్నారు. అక్కడున్న టీచర్ లీవ్‌లో ఉండటంతో, వేరే స్కూల్ PTIని తాత్కాలికంగా పంపించారు. పిల్లలు తక్కువగా ఉన్నారని వంట ఏజెన్సీ వారు మధ్యాహ్న భోజనం చేయడం లేదు. దీంతో పిల్లలు లంచ్ కోసం ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. వారికి అందాల్సిన గుడ్లు, రాగిజావ కూడా ఇవ్వడం లేదు. సరైన ఫెసిలిటీస్ లేక చాలామంది వేరే స్కూళ్లకు మారిపోతున్నారు. దీనిపై గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

More in TG