నూతక్కిలో MLM మోసం.. 36 లక్షలు!
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలో WINFITH సంస్థ పేరుతో సుమారు 36 లక్షలు వసూలు చేసి మోసం చేశారని పలువురు బాధితులు ఆరోపించారు. లక్షా 20 వేలు పెట్టుబడి పెడితే ఐదు నెలల్లో 2 లక్షలు తిరిగి ఇస్తామని చెప్పి, ఏజెంట్ షేక్ రజాక్ ద్వారా సుమారు 30 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. కానీ ఆరు నెలలకే సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయని, తమ డబ్బు తిరిగి ఇప్పించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.



