ఆసుపత్రి పనులను పరిశీలించిన కలెక్టర్.

హనుమకొండ జిల్లా పరకాలలోని కొత్త ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ రేడియాలజీ, ఎమర్జెన్సీ, బ్లడ్ బ్యాంక్, OP, ICU, తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో విద్యుత్, ఆక్సిజన్ పైప్‌లైన్ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. పాత ఆసుపత్రిలో కొనసాగుతున్న అన్ని విభాగాలను నూతన భవనానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.


