← Back to news

మల్లాపూర్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా

By DK· 1d ago
మల్లాపూర్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా

TG: వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. వర్షాలు లేక పంటల పరిస్థితిపై ఆందోళనలో ఉన్న తమకు వ్యవసాయానికి కేటాయించిన 10 గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ కోతలతో విద్యుత్ సరఫరా జరగడంతో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని తెలిపారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈ వినీత్‌రెడ్డికి రైతులు వినతిపత్రం అందజేశారు.

More in Local