← Back to news

ఉపాధితోనే పేద కుటుంబాలకు భరోసా

By A VIJAY KUMAR· 6h ago· Warangal
ఉపాధితోనే పేద కుటుంబాలకు భరోసా

పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నిరుపేద కుటుంబాల అభ్యున్నతికి సంక్షేమ పథకాలతో పాటు ఉపాధి అవకాశాలను పెంచాలి. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం, పక్కా ఇళ్లు అందించాలని, రైతులు, కూలీలు, మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించాలని వరంగల్ జిల్లాలో పలువురు కోరుతున్నారు. ఇవాళ అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా పేదల అభ్యున్నతిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

More in Local