← Back to news

తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్!

By Bala· 1d ago
తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్!

బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ప్రభావంతో TG, APలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. TGలో మంచిర్యాల, కొమురంభీం, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ కాగా.. రేపు కూడా ఇదే అలర్ట్ కొనసాగనుంది. హైదరాబాద్‌లో సాధారణ నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. APలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో వర్షాల తీవ్రత తక్కువగా ఉండనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

More in National