← Back to news

విద్యుత్ కోతలపై రోడ్డెక్కిన రైతులు

By DK· 2d ago
విద్యుత్ కోతలపై రోడ్డెక్కిన రైతులు

TG: అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ వనపర్తి జిల్లా నాచహల్లి, కృష్ణగిరి, పెద్దగూడెం తండా, సవాయిగూడెం గ్రామాల రైతులు సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. వనపర్తి–పెబ్బేరు ప్రధాన రహదారిపై బైఠాయించి విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న ఏఈ చంద్రశేఖర్ అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా, డీఈతో మాట్లాడించాలని రైతులు పట్టుబట్టారు. ప్రభుత్వం 13 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు.

More in Local