← Back to news

హుస్నాబాద్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

By Bejjanki· 23h ago· Siddipet

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. బాపూజీ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించి, చైర్‌పర్సన్ మాట్లాడుతూ, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో బాపూజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. 1969 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ఆయన తన మంత్రి పదవిని కూడా త్యాగం చేశారని గుర్తుచేశారు. బాపూజీ సేవలను, ఆశయాలను భావితరాలకు అందించాలని ఆమె కోరారు.

More in Local