బిల్లుల అవకతవకలపై కలెక్టర్ స్పందించాలి

అన్నమయ్య జిల్లా డీఈఓ లాగిన్‌లో డేటా మార్పులు, 1.40 కోట్ల రూపాయల గుడ్లు, చిక్కీల బిల్లుల అవకతవకలపై విచారణ జరపాలని APSJAC, USFI డిమాండ్ చేశాయి. మదనపల్లిలో పాఠశాల రీజనల్ జాయింట్ డైరెక్టర్ నియమించిన కమిటీ సభ్యులకు సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు. APSJAC రాష్ట్ర అధ్యక్షులు వి. ఉత్తన్న, USFI రాష్ట్ర ఉపాధ్యక్షులు సర్వేపల్లి నరసింహ మాట్లాడుతూ.. జిల్లా అధికారిపై పైస్థాయి అధికారులతో విచారణ జరిపించాలని కోరారు.


