అన్నం వృథా కావొద్దు.... పేదలకే!

మంచిర్యాల జిల్లా మందమర్రిలోని శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి గణపతి మండపం వద్ద అన్నదానం జరిగింది. మిగిలిన ఫుడ్ వృథా కాకూడదని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి సమాచారం ఇచ్చారు. వెంటనే టీమ్ రంగంలోకి దిగింది. మిగిలిన ఆహారాన్ని సేకరించి, మందమర్రి పరిసరాల్లోని పేదలకు పంపిణీ చేసింది. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నందిపాటి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఏ కార్యక్రమంలోనైనా ఫుడ్ మిగిలితే సొసైటీకి చెప్పండని కోరారు.



