తొలగించిన ఓటర్లపై ఇంటింటి సర్వే

నెల్లూరు జిల్లాలో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 2,99,574 మంది పేర్లపై శుక్రవారం నుంచి బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికీ వెళ్లి పునఃపరిశీలన చేపట్టనున్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు పొరపాటున తొలగించి ఉంటే, ఫారం–6 ద్వారా తిరిగి జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఈ నెల 16న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించారు.



