అక్రమాలు చేస్తే ఊరుకోం: కలెక్టర్

జోగులాంబ గద్వాల జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి తిప్పలు లేకుండా చూడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. IDOCలో నిర్వాహకులతో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, వేరే రాష్ట్రాల నుంచి వరి తెచ్చినా, మిల్లుల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం చెప్పిన 7 రకాల సన్న వరికి క్వింటాల్‌కు 500 రూపాయిల బోనస్ ఇస్తామన్నారు.





