← Back to news

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

By Bala· 7h ago
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన జంపుల అరవింద్ కొద్ది రోజుల క్రితం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పట్టణంలోని వినాయక మండపాల నిర్వాహకులు, ఉత్సవ సమితి సభ్యులు స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించి 81,516 రూపాయలు విరాళంగా సేకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబానికి తమ వంతు సహాయం అందించడం బాధ్యతగా భావించామని తెలిపారు.

More in Local