రెండేళ్లుగా మూతలోనే గురుకుల పాఠశాల!
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి)లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల భవనం సమస్యలతో రెండేళ్లుగా మూతపడటంపై పూర్వ విద్యార్థులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే పాఠశాలను నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. అధికారులు భవనాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పాఠశాలను తిరిగి ప్రారంభించాలని కోరారు.



