← Back to news

రెండు నెలలైనా.. 63 శాతమే!

By A.Ajay· 7 Oct 2026
రెండు నెలలైనా.. 63 శాతమే!

TG: హైదరాబాద్లో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ఇంకా పూర్తికాలేదు. ఆగస్టు 15న పంపిణీ ప్రారంభించినా రెండు నెలలు దాటినప్పటికీ 8,43,048 మంది లబ్ధిదారుల్లో 5,36,650 మందికే కార్డులు అందాయి. మరో 3,06,398 మంది ఇంకా కార్డులు తీసుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులు పాత కార్డులతోనే రేషన్‌ తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. బోగస్‌ కార్డులను తొలగించేందుకు చేపట్టిన ఈ-కేవైసీ 81.78 శాతం పూర్తయింది. మిగిలిన వారికి స్మార్ట్‌ కార్డులు ఎప్పుడు అందుతాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

More in TG