జగిత్యాలలో నిమజ్జనం తేదీలివే..
జగిత్యాల పట్టణంలో వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సీఐ కరుణాకర్ సూచించారు. పట్టణంలో విగ్రహాల నిమజ్జనానికి సెప్టెంబర్ 23, 24 తేదీలను నిర్ణయించారు. భక్తులు, మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూడాలన్నారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో జరుపుకోవాలని సీఐ పిలుపునిచ్చారు. మీ ఊరి వార్త మీరే పంపండి!



