← Back to news

నాన్న ఆశయమే నా సక్సెస్‌కు బలం: సీఐ అంజలి

By A VIJAY KUMAR· 1d ago· Mahabubabad (Ct), Mahabubabad, Mahabubabad
నాన్న ఆశయమే నా సక్సెస్‌కు బలం: సీఐ అంజలి

తండ్రి ఆశయమే తనను పోలీస్‌ శాఖలో ఉన్నత స్థాయికి తీసుకువచ్చిందని మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి తెలిపారు. జాతీయ కూతుర్ల దినోత్సవం సందర్భంగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. తాను ఈ స్థాయికి చేరేందుకు తండ్రి ఎంతో కష్టపడ్డారని చెప్పారు. తనను పోలీస్ చేయాలన్నది ఆయన కల అని, ఆ దిశగా ఎప్పుడూ ప్రోత్సహించారని తెలిపారు. ఏడాది క్రితం తండ్రి మరణించడం తన జీవితంలో తీరని లోటని పేర్కొన్నారు. తండ్రి ఆశీస్సులు, స్ఫూర్తే తన విజయానికి బలమని చెప్పారు.

More in Local