మత సామరస్యానికి చిరునామా

TG: హనుమకొండ జిల్లా కేంద్రంలోని పెద్దమ్మగడ్డలో ముస్లిం యువకులు మత సామరస్యానికి నిజమైన ఎగ్జాంపుల్‌గా నిలుస్తున్నారు. క్రికెట్ కోచ్ మహమ్మద్ మోహిన్, ఆయన ఫ్రెండ్స్ సయ్యద్ షకీల్, షేక్ అఫ్రోజ్, మహ్మద్ ఖాదర్ కలిసి సొంత డబ్బులతో వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. వరుసగా ఏడేళ్ల నుంచి గణపతి నవరాత్రులను జరుపుతున్నారు. భక్తికి మతాలు అడ్డుకావని నిరూపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. మీ ఊళ్లోనూ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా? అందరూ కలిసి మతసామరస్యాన్ని చాటుకుంటున్నారా? అయితే ఆ వివరాలు మాకు పంపించండి.


