నర్సంపేటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

నర్సంపేట పట్టణంలో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ₹17,650 నగదు, ఏడు సెల్ఫోన్లు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చర్యల నిమిత్తం నర్సంపేట పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ అధికారులు వెల్లడించారు.



