Army పబ్లిక్ స్కూల్లో ఘనంగా దసరా వేడుకలు
హైదరాబాద్.. గోల్కొండ లోని Army పబ్లిక్ స్కూల్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. దసరా సెలవులకు ముందు స్కూల్లో నవరాత్రి వేడుకను నిర్వహించారు. విజయదశమి పండుగ చరిత్ర విద్యార్ధులకు తెలిసేలా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీచర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. రామాయణం, పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోయిన విద్యార్థులు.. అద్భుతంగా నటించి, అందర్నీ మెప్పించారు.



