← Back to news

పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం

By Bala· 1h ago
పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం

HYD: సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు మౌలాలి వద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. రైలు ఇంజిన్‌లోని ప్యాంటోగ్రాఫ్ విరిగిపోవడంతో రైలు మార్గమధ్యలో నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే మరమ్మతు చేపట్టారు. సుమారు గంటపాటు శ్రమించిన అనంతరం లోపాన్ని సరిచేసి రైలును తిరిగి నడిపించారు. ఈ ఘటనతో సికింద్రాబాద్ నుంచి VZM, VSP, TPT వైపు వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది.

More in TG