యాదగిరిగుట్టలో భక్తుల గిరిప్రదక్షిణ

భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అష్టోత్తర శత ప్రత్యేక అభిషేకం ఘనంగా చేపట్టారు. అనంతరం వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ చేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలయ ఈఓ భవాని శంకర్ పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.