అమ్మవారి సేవలో ఎస్పీ దంపతులు.. ప్రత్యేక పూజలు!

నాగర్కర్నూల్ జిల్లాలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ దంపతులు పూజలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎస్పీ దంపతులను సన్మానించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.



