స్వచ్ఛతపై అవేర్‌నెస్ కోసం ప్రోమో రన్

విజయవాడలో స్వచ్ఛత, పచ్చదనం వైపు ప్రజలు అడుగులు వేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న జరగనున్న స్వచ్ఛథాన్-2026కు ప్రచారంగా బందర్ రోడ్డులో HDFC స్వచ్ఛథాన్ ప్రోమో రన్ నిర్వహించారు. రన్నర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛత, పచ్చదనం, వ్యర్థాల నిర్వహణపై నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహం, ఆర్టీసీ బస్టాండ్, ప్రకాశం బ్యారేజ్, సీడ్ యాక్సిస్ రోడ్, కృష్ణా కరకట్టను కలుపుతూ రన్ రూట్‌ను రూపొందించారు.



