← Back to news

అడవి లాంటి జీడి చెట్టు.. ఎక్కడుందో తెలుసా?

By Krishna· 1d ago· Instagram
అడవి లాంటి జీడి చెట్టు.. ఎక్కడుందో తెలుసా?

బ్రెజిల్‌లోని పిరాంగి దో నోర్టే ప్రాంతంలో ఉన్న "మైయోర్ కాజుయీరో దో ముండో" ప్రపంచంలోనే అతిపెద్ద జీడిచెట్టు. ఇది దాదాపు 8వేల 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి, పై నుంచి చూస్తే ఒక చిన్న అడవిలా కనిపిస్తుంది. ఈ చెట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ ఎక్కింది. దీని కొమ్మలు నేలను తాకి, అక్కడే వేర్లు పాతుకుని కొత్త కాండాలుగా మారుతాయి. అయితే అవన్నీ అసలు చెట్టుకే లింక్ అయ్యి ఉంటాయి. ఈ సహజ ప్రక్రియ వల్ల చెట్టు అన్ని వైపులా విస్తరిస్తూ, ఫుట్‌బాల్ మైదానం కంటే పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించింది.

More in Entertainment