అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌కు పవిత్ర ఎంపిక

చిత్తూరు జిల్లా పుంగనూరులో మహేష్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థిని పవిత్ర జపాన్‌లో జరిగే అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌కు ఎంపికై జపాన్ చేరుకున్నారు. పుంగనూరుకు చెందిన మిస్ కే. పవిత్ర జపాన్‌లోని యోకోహామాలో జరగనున్న 11వ షిటో ర్యూ కరాటే ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పాల్గొననున్నారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, నిరంతర సాధనతో పవిత్ర ఈ స్థాయికి చేరుకోవడం అకాడమీతో పాటు పుంగనూరుకు గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు.


