← Back to news

జైలు నుంచి బయటకొచ్చి మళ్లీ అదే పని

By dk· 15 Aug 2026· అన్నమయ్య జిల్లా
జైలు నుంచి బయటకొచ్చి మళ్లీ అదే పని

AP: అన్నమయ్య జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలను రాయచోటి అర్బన్<br> పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గాలివీడు మండలం తూముకుంటకు చెందిన మావిళ్ల వీరారెడ్డి అలియాస్ వీరారెడ్డి నాయుడు (45), కోటకొండ ఆంజనేయులు అలియాస్ గుండు (40) అన్నమయ్య, కడప, అనంతపురం జిల్లాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై ఇప్పటికే మూడు జిల్లాల్లో 31 ద్విచక్ర వాహనాల చోరీ కేసులు ఉన్నట్లు DSP కృష్ణమోహన్ తెలిపారు.

More in Local