కొందుర్గ్ మండలంలో అక్షరమాల పరీక్షలు

రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలో ‘అమ్మకు అక్షరమాల’ పరీక్షలు నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో 22 పరీక్ష కేంద్రాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 1,674 మంది అభ్యర్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల నిర్వహణను మండల వయోజన విద్య కోఆర్డినేటర్ నారాయణ ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాసపల్లి, బైరంపల్లి, రేగడిచిల్కమర్రి గ్రామాల్లోని పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు.




