ఓటర్ల జాబితా ప్రక్రియపై రాజకీయ పార్టీలతో సమావేశం

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కొనసాగుతున్న SIR–2026 ఓటర్ల జాబితా ప్రక్రియపై అదనపు కలెక్టర్, ERO హరిప్రియ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 23 నాటికి 93.59 శాతం నోటీసులు పంపడం పూర్తికాగా, 45.33 శాతం విచారణలు పూర్తయ్యాయని ఆమె తెలిపారు. మిగిలిన విచారణలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫారం–6, 7, 8కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు.



