← Back to news

పోస్ట్‌మార్టం గదిలో మద్యం పార్టీ

By Lokesh· 2h ago· Ndtv
పోస్ట్‌మార్టం గదిలో మద్యం పార్టీ

మహారాష్ట్రలోని పింప్రి-చించ్‌వాడ్‌ YCM ఆసుపత్రి పోస్ట్‌మార్టం రూంలో మద్యం పార్టీ జరిగినట్లు చూపించే వీడియో వైరల్‌గా మారింది. డెత్ సర్టిఫికెట్ కోసం వచ్చిన ఓ వ్యక్తి ఈ ఘటనను గుర్తించినట్లు సమాచారం. వీడియోలో ఆహార పదార్థాలు, మద్యం బాటిల్ కనిపించాయి. దీంతో డాక్టర్ వైభవ్ అవినాష్ మాస్కేను సస్పెండ్ చేశారు. 15 రోజుల్లో ఛార్జ్‌షీట్ ఫైల్ చేయనున్నారు. సస్పెన్షన్‌లో ఉన్నంతకాలం పింప్రి ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లకూడదని ఆదేశించారు.

More in National