← Back to news

అమిత్ షా ట్వీట్: యూత్ పవర్ అంటే ఇదే

By Sahani· 2h ago· X
అమిత్ షా ట్వీట్: యూత్ పవర్ అంటే ఇదే

ఒడిశా స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్‌లో RSS అనుబంధ విద్యార్థి సంఘం ABVP విజయం సాధించింది. అక్టోబర్ 15న జరిగిన ఈ పోలింగ్‌లో మొత్తం 13 స్టేట్ యూనివర్సిటీల్లో 8 స్థానాలతో పాటు వందకు పైగా కాలేజీల్లో సీట్లు సాధించింది. ఈ విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. ఫేక్ న్యూస్, గందరగోళం క్రియేట్ చేసే దేశ వ్యతిరేక శక్తులకు ఈ రిజల్ట్స్ గట్టి కౌంటర్ అని, యూత్ ఎప్పుడూ 'నేషన్ ఫస్ట్' ఐడియాలజీకే సపోర్ట్ ఇస్తారని ట్వీట్ చేశారు.

More in National