← Back to news

🌱ఎన్విరాన్మెంట్‌ను కాపాడే వినాయక విగ్రహాలు

By BK· 1d ago· ప్రకాశం
🌱ఎన్విరాన్మెంట్‌ను కాపాడే వినాయక విగ్రహాలు

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పుగంగవరం హరిదాస్ నగర్‌లో పర్యావరణ పరిరక్షణ కోసం ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ప్రకృతి విభాగంలో ICRPగా పనిచేస్తున్న అనంత లక్ష్మి అనే మహిళ సొంతంగా ఈ ఐడల్స్‌ని తయారు చేశారు. ఆవు పేడ, ఆవు పంచకం, బంకమట్టి, నెయ్యితో చాలా పవిత్రంగా వీటిని తీర్చిదిద్దారు. ఎన్విరాన్మెంట్‌ను కాపాడేందుకే ఈ స్పెషల్ విగ్రహాలు చేసినట్లు ఆమె చెప్పారు. మీరు కూడా మీ ఊరి మట్టి గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.

More in Local