← Back to news

కోళ్ల ప్రాణాలు తీస్తున్న E.coli

By Krishna· 2h ago
కోళ్ల ప్రాణాలు తీస్తున్న E.coli

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చనిపోతున్న ప్రతీ 5 కోళ్లలో ఒకటి E.coli ఇన్ఫెక్షన్ వల్లే మరణిస్తోందని ఒక స్టడీ తేల్చింది. రాజేంద్రనగర్‌ వెటర్నరీ సైన్స్ కాలేజీ రీసెర్చర్లు 45 పౌల్ట్రీ ఫారాల్లో చనిపోయిన 759 కోళ్లపై పరిశోధనలు జరిపారు. ఈ వ్యాధి వల్ల హార్ట్, లివర్, లంగ్స్ దెబ్బతింటున్నాయని గుర్తించారు. 15 నుంచి 21 రోజుల వయసున్న కోళ్లలో డెత్ రేటు ఎక్కువగా ఉంది. దీనిని అరికట్టడానికి సెఫ్ట్రియాక్సోన్ లాంటి యాంటీబయాటిక్స్ బాగా పనిచేస్తాయనీ, సరైన పద్ధతులతో మరణాలను తగ్గించవచ్చని రీసెర్చర్లు సూచించారు.

More in TG