హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అలర్ట్!

TG: హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్.. GHMC, హైడ్రా, పోలీసు, రెవెన్యూ వంటి శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. “అలెర్ట్‌గా ఉందాం.. అలెర్ట్‌గా ఉంచుదాం” అనే టార్గెట్‌తో.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆఫీసర్లు పనిచేయాలని ఆదేశించారు. రోడ్లపై ఉన్న పూడిక, డెబ్రిస్‌ను వెంటనే తొలగించి, ఎక్కడా నీరు నిలిచిపోకుండా చూడాలన్నారు. రిజర్వాయర్లు నిండితే మూసీ ప్రాంత ప్రజలను ముందుగా అలర్ట్ చెయ్యాలనీ, ఎమర్జెన్సీ టీమ్స్‌ని రెడీగా ఉంచాలని సూచించారు.

