← Back to news

డాలర్ల పేరుతో డ్రామా.. లక్షల మోసం

By BK· 23h ago· విశాఖపట్నం
డాలర్ల పేరుతో డ్రామా.. లక్షల మోసం

విశాఖపట్నంలో నగదు మార్పిడి పేరుతో భారీ మోసం జరిగింది. ఆన్‌లైన్‌లో పరిచయమైన 'రాజు' అనే వ్యక్తి, రూపాయలు ఇస్తే డాలర్లు ఇస్తానని నమ్మించి ఒక RTC డ్రైవర్‌ను, అతని స్నేహితుడిని మోసం చేశాడు. నిన్న అర్ధరాత్రి డైమండ్‌ పార్కు వద్ద డాలర్ల కోసం వెళ్లిన వారిపై దుండగులు దాడి చేసి, 68 లక్షల రూపాయిలతో పాటు 10 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో ద్వారకానగర్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం మూడు టీమ్‌లుగా ఏర్పడి వెతుకుతున్నారు.

More in Local