I&PR శాఖకు నేషనల్ లెవల్లో స్కోచ్ అవార్డులు

ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కింది. డిజిటల్ పద్ధతిలో పారదర్శకంగా మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియ పూర్తి చేసినందుకు I&PR శాఖకు 'స్కోచ్ సిల్వర్ అవార్డు' లభించింది. 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ' డిజిటల్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్‌కు ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌కు 'స్కోచ్ గోల్డ్ అవార్డు' వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన 109వ స్కోచ్ సమ్మిట్‌లో అధికారులు ఈ పురస్కారాలు అందుకున్నారు.



