బ్రిడ్జ్ బీమ్‌లపై కాంక్రీట్ ఊడి.. భద్రతపై ఆందోళన

TG: మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్ పరిధిలో హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జ్ బీమ్‌ల కింది భాగంలో కాంక్రీట్ దెబ్బతిని ఇనుప చువ్వలు ఊడిపోయాయి. వంతెన భద్రతపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీమ్‌లు దెబ్బతినడానికి నిర్మాణ నాణ్యత లోపం కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు కారణం అధికారుల పరిశీలనలో తేలాల్సి ఉంది. ఓఆర్‌ఆర్ పరిధిలో రహదారులు, వంతెనల పర్యవేక్షణ సిబ్బంది ఉన్నప్పటికీ ఈ విషయం వారి దృష్టికి రాకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు.