← Back to news

జర్నలిస్టులను చంపేస్తారా?: హర్ష యాదవ్

By Lokesh· 1h ago· Instagram

అక్టోబర్ 10న ఢిల్లీ.. జంతర్ మంతర్ దగ్గర జరిగే CJP ప్రొటెస్ట్‌కు వెళ్లే జర్నలిస్టులను పోలీసులు డిటైన్ చేస్తున్నారని ఇండిపెండెంట్ జర్నలిస్టు హర్ష యాదవ్ తెలిపారు. యూపీలో జర్నలిస్టుల ఇళ్ల ముందు పోలీసులు కాపలా ఉంటున్నారనీ, తాను సేఫ్టీ కోసం సీక్రెట్ ప్లేస్‌లో ఉంటున్నానని చెప్పారు. పోలీసులతో పాటు, ధర్మరక్షకులమని చెప్పుకునే కొందరి నుంచి కూడా బెదిరింపులు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రొటెస్ట్‌ను కవర్ చేసే జర్నలిస్టులకు ప్రజలు సపోర్ట్ ఇవ్వాలని కోరారు.

More in National