డేంజర్గా మారిన కరెంట్ స్తంభం
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులోని పాపాయిగూడెం రోడ్ దగ్గర కరెంట్ పోల్ గత 3 నెలలుగా పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారింది. ఆఫీసర్లు మాత్రం దీన్ని పట్టించుకోవట్లేదని లోకల్స్ ఫైర్ అవుతున్నారు. పోల్ కూలిపోతే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ఛాన్స్ ఉందంటున్నారు. వెంటనే స్పందించి ఒరిగిన స్తంభాన్ని రిపేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

