మట్టి వినాయకులనే తీసుకోండి: బీటెక్ రవి పిలుపు

AP : పర్యావరణాన్ని కాపాడటానికి అందరూ మట్టి వినాయక విగ్రహాలనే తీసుకోవాలని TDP పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి కోరారు. శనివారం జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి, నాయకులతో కలిసి మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 1000కి పైగా మట్టి వినాయకులను ఇస్తున్నట్లు చెప్పారు. కెమికల్ కలర్స్ విగ్రహాల వల్ల వాటర్ పొల్యూట్ అవుతుందని అన్నారు. అలాగే మండపాల దగ్గర డీజేలలో అశ్లీల, పొలిటికల్ పాటలకు పర్మిషన్ లేదని స్పష్టం చేశారు.