నిధుల సమీకరణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ప్రజాసమస్యల పరిష్కారానికి అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. 24 వార్డుల్లో బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 9, బీజేపీ ఒక వార్డును దక్కించుకున్నాయి. పరిమితంగా అందుబాటులో ఉన్న నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోవడం అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు.


