ఆయుర్వేద డే.. ఇదో హెల్తీ లైఫ్ స్టయిల్

జయశంకర్ భూపాలపల్లిలో 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం జరిగింది. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. ఆయుర్వేదం ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ కె. రాఘవేందర్ రావు ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ ఆయుష్ 50 పడకల ఆసుపత్రిలో క్యాంప్ జరిగింది. ఆయుర్వేదం వ్యాధుల చికిత్సే కాదు, ఆరోగ్యకర జీవన విధానం, సమతుల్య ఆహారం, ప్రకృతి ఆధారిత వైద్యం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పారు.


