ప్యాచ్ వర్క్ తక్షణం కావాలె... లేకపోతే..
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ మండల కేంద్రం నుంచి అలంపూర్ చౌరస్తాకు వెళ్లే రోడ్డు గుంతల మయమైంది. తారు లేచి పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో రోజూ చాలా మంది ప్రయాణిస్తున్నారు. జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలకు వెళ్లే నాయకులు కూడా ఇదే రోడ్డు వాడుతున్నారు. రాత్రి సమయంలో గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కనీసం ప్యాచ్ వర్క్ చేసి గుంతలు పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.


