← Back to news

ప్రమాదకరంగా మారిన ఆర్మూర్ బైపాస్ రోడ్డు

By naveed mohd· 16h ago· Al Thawn, Al Khobar, Al Khobar
ప్రమాదకరంగా మారిన ఆర్మూర్ బైపాస్ రోడ్డు

నిజామాబాద్ జిల్లా నందిపేటలోని ఆర్మూర్ బైపాస్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మోకాళ్ల లోతు వరకు గుంతలు ఉండటంతో రహదారిపై రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. రెండురోజుల క్రితం నిజామాబాద్‌ నుంచి కుదమ్‌పూర్‌ వైపు వెళ్తున్న ఆటో గుంతలో చిక్కుకుని నిలిచిపోయింది. అందులో గర్భిణి ఉండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు స్పందించకపోవడంతో VDC సభ్యులు చొరవ తీసుకుని గుంతల్లో మట్టి పోశారు.

More in Local